Krishnagaadi Veera Prema Gaadha Movie Review

‪‎Krishnagaadi Veera Prema Gaadha Movie Review – Nani, Mehrene Kaur Peerzada. Directed by Hanu Raghavapudi. Release Date – 12 February 2016.

Krishnagaadi Veera Prema Gaadha Movie

Krishnagaadi Veera Prema Gaadha Movie Review

కృష్ణగాడి వీర ప్రేమగాథ : దర్శకుడు హను రాఘవపూడి కవితాత్మకంగా తీసిన ‘అందాల రాక్షసి’ సినిమాతో ప్రేక్షకులని పూర్తిగా మెప్పించలేకపోయినా తన రెండవ ప్రయత్నంగా తీసిన ఈ సినిమాతో ఆకట్టుకున్నాడు. వినోదభరితమైన కథకి వీరత్వం జోడించి కథనాన్ని తెలివిగా నడిపించాడు. కథలో అక్కడక్కడా బిగి సడలినా, మొత్తంమీద పట్టు కోల్పోకుండా, ప్రేక్షకుల దృష్టి మరలకుండా చూసుకోవటంలో విజయం సాధించాడు.

పిరికి ప్రేమికుడు క్రిష్ణగాడి పాత్రలో నాని పరకాయ ప్రవేశం చేసి మెప్పించాడు. మిగతా వాళ్ళంతా తమ పాత్రలను చక్కగా పోషించడంతో ఈ ప్రేమగాథ రక్తి కట్టింది.

హీరోయిన్ మెహ్రీన్ కొంచెం బొద్దుగా ఉన్నా ముద్దుగా, అందంగా కనిపించింది. అమాయకంగా కనిపిస్తూ గడుసుగా హీరోతో పోట్లాడే మహాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. కొన్ని సన్నివేశాల్లో లక్ష్మీ కల్యాణం సినిమాలో కాజల్ ని గుర్తు తెచ్చింది.

ముద్దుగా ఉన్న చిన్నపిల్ల నైనీ మరింత ముద్దుగా నటించి మనసుని ఆహ్లాదపరిచింది.

విశాల్‌ చంద్రశేఖర్‌ అందించిన సంగీతం బాగానే ఉంది. జైకృష్ణ, హను రాసిన సంభాషణలు సహజంగా ఉన్నాయి.

గొప్ప సినిమా అని చెప్పలేకపోయినా కాలక్షేపానికి లోటు లేని సినిమా ఇది. కొంచెం నిడివి తగ్గించి సెకండ్ హాఫ్ లో బలవంతంగా ఇరికించిన పాటలు తీసేసి ఉంటే మరింత మంచి సినిమా అయ్యేది.

Surendra.S for TeluguCafe.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *